బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (09:21 IST)

పార్టీకి వచ్చిన సింహం.. కొబ్బరిచెట్టెక్కిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?

Lion
Lion
సింహం పార్టీకి వచ్చింది. అంతే జనం జడుసుకున్నారు. తాజాగా ఓ సింహం విద్యుత్ వెలుగుల్లో జరుగుతున్న పార్టీలోకి చొరబడింది. పార్టీ జరుగుతున్న ప్రదేశంలోకి సింహం రావడంతో అందరూ అక్కడినుంచి పరుగులు లంకించుకోగా.. ఓ వ్యక్తి మాత్రం వేగంగా వెళ్లి కొబ్బరిచెట్టును ఎక్కాడు. 
 
ఆ వ్యక్తిని టార్గెట్‌గా చేసుకున్న సింహం కొబ్బరిచెట్టు ఎక్కినా వదల్లేదు. అది సైతం కొబ్బరి చెట్టు ఎక్కి ఆ వ్యక్తిని వేటాడే ప్రయత్నం చేసింది. అయితే చెట్టు చివరికి ఎక్కిన వ్యక్తి కాళ్లతో సింహాన్ని కాలితో తన్నాడు. ఈ వీడియో క్లిప్ అంతటితో ఆగిపోతుంది.. ఆ తరువాత ఆ వ్యక్తికి ఏమైనా జరిగిందా అన్న సమాచారం వీడియోలో కనిపించలేదు.