1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:19 IST)

అలా మోసం చేస్తే ఉద్యోగం నుంచి పీకేస్తాం: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వార్నింగ్

infosys
ఉద్యోగం చేస్తూనే ఇతర కంపెనీల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారి సంఖ్య ఎక్కువయిపోతోందని పలు కంపెనీలు తమ ఉద్యోగుల వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుపిస్తున్నాయి. తాజాగా ఇండిటన్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

 
కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగులుగా కొనసాగుతూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేవారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కంపెనీ నియమావళి ప్రకారం ఇది విరుద్ధమనీ, ఇలా ఒకే సమయంలో రెండు ఉద్యోగాలను చేసేవారిని ఉపేక్షించేది లేదని, ఇలాంటివారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామంటూ ఇ-మెయిల్స్ పంపింది.

 
ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి వల్ల కంపెనీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇలాంటి వారి వల్ల పనితీరులో నాణ్యతలోపం, రహస్య సమాచారం లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఇలాంటి ఇ-మెయిల్స్ ఇవ్వడంతో అది కాస్తా ఇప్పుడు ట్రెండింగ్ అయ్యింది.