బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (23:22 IST)

ఆరోగ్యంగా వుండాలంటే.. చాలాసేపు కూర్చోకండి..video

office work
అవును.. ఆరోగ్యంగా వుండాలంటే.. చాలాసేపు కూర్చోవడం చేయకండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలాసేపు అంటే గంటల పాటు కూర్చోవడం ద్వారా మధుమేహం బారిన పడే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ కరువైతే.. డయాబెటిస్, ఒబిసిటీ తప్పదంటున్నారు.  
 
ఒకే విషయంపై చాలాసేపు కూర్చోవడం, ఆలోచించడం వల్ల మెదడు చురుకుదనం తగ్గుతుంది. కాబట్టి ఆరోగ్యంగా.. ఉత్సాహంగా వుండాలంటే.. శరీరానికి విటమిన్‌ బి, సి, డిల ఆవశ్యకత హెచ్చుగా అవసరమవుతుంది.
 
దీని కోసం రోజూ ఆపిల్ తినడం మరవకూడదు. అరటి పండ్లు, క్యారెట్ రోజూ తీసుకోవాలి. అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. ఫ్రూట్స్‌ లేదా ఓట్స్‌ తినడం చాలా అవసరం. 
 
ఉదయం తినడంవల్ల మెదడు చాలా ఏకాగ్రతతో ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి, వీలైతే కిస్‌మిస్‌లు, కాజు, బాదంపప్పు ప్రతి గంటకు రెండు మూడు పలుకులు తినడంవల్ల, శారీరక శక్తి ఎప్పుడూ అందుబాటులో వుంటుంది.
 
మధ్యాహ్నం, రాత్రి కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. కొంచెం కొంచెం నాలుగుసార్లు తినడంవల్ల ఉత్సాహంగా ఉంటుంది. వీలైతే, సాయంత్రం రాగులు, సజ్జలు, జొన్నలతో తయారుచేసిన ఆహారం తీసుకుంటే మంచిది. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. 
 
వీటికి బదులు కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది. రోజూ ఒక కోడిగుడ్డైనా తీసుకోవాలి. గ్రీన్‌ టీ మంచిది. నీరు అధికంగా తాగడం మంచిది. ముఖ్యంగా రోజుకు అరగంట వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.