ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (14:21 IST)

సునంద మృతి కేసులో శశిథరూర్‌కు హైకోర్టు నోటీసులు

shasi tharoor
తన భార్య సునంద మృతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత 2014 జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునంద పురష్కర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకునేలా శశిథరూర్ ప్రేరేపించారనే అభియాగాలు ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన నిందితుడిగా పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. దీంతో శశిథరూర్ ఢిల్లీలోని పాటియాలా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరిపిన కోర్టు 2021 ఆగస్టులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
 
అయితే, పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు శశిథరూర్‌కు నోటీసులు జారీచేస్తూ ఈ కేసు తదుపరి విచారణను వచ్చే యేడాది ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.