బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (10:57 IST)

అరుదైన పదంతో బీజేపీని ఏకిపారేసిన శశిథరూర్..

ఇంగ్లీష్ భాష బాగా పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అరుదైన పదంతో బీజేపీని ఏకిపారేశారు. ఇంగ్లీష్‌లో అరుదైన పదాన్ని వెతికిపట్టుకుని మరీ బీజేపీపై దాడి చేశారు.అలడాక్సొఫోబియాతో బీజేపీ నాయకత్వం బాధపడుతుండటమేనని ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చీటికి మాటికి ప్రజలపై రాజద్రోహం, యూఏపీఏ కేసులు పెడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. 
 
దీనికి కారణం అలడాక్సొఫోబియానే కారణమని ట్వీట్ చేశారు. అలడాక్సొఫోబియా పదానికి అర్ధాన్ని కూడా వివరించారు. ఈ పదానికి గ్రీకులో ఉన్న అర్ధం గురించి చెబుతూ.. అల్లో (allo)-విభిన్న, డొక్సో (doxo)- అభిప్రాయాలు, ఫోబోస్(phobos)- భయం అని విడమరిచి చెప్పారు. అంతేగాకుండా ఈ పదానికి అర్థం అభిప్రాయాలంటే అహేతుక భయం. బీజేపీ ఇప్పుడు ఇదే భయంతో బాధపడుతోందని శశిథరూర్ విమర్శించారు.