బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (11:35 IST)

బిగ్‌బాస్ ఐదో సీజన్ : ఈ వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్ ఏంటి?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆలరిస్తున్న కార్యక్రమాల్లో ఒకటి బిగ్ బాస్. ప్రస్తుతం ఐదో సీజన్ రియాల్టీ షో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు పూర్తయిపోయింది.
 
గత సీజన్స్‌లానే ఇంటిసభ్యుల మధ్య గొడవలు, అరుపులు, గోలలు. ఏడుపులు, నవ్వులు ఇలా సందడిగా బిగ్ బాస్ సాగుతుంది. ఇక హౌస్‌లోకి వచ్చిన వలందరూ వీలైనన్ని ఎక్కువ రోజులు ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 
 
అయితే మొదటి వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సీజన్ 5 మొదటి కెప్టెన్‌గా సిరి హనుమంత్ ఎంపిక అయ్యింది. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు శనివారం నాటి ఎపిసోడ్‌లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది మానస్, సరయు, కాజల్, జెస్సీలు ఈ నలుగురిలో ఒకరు ఈ వారం బయటకు వెళ్లనున్నారు. వీరిలో ప్రేక్షకుల ఓటింగ్ బట్టి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
 
అయితే ఈ ఓటింగ్‌లో సరయు జేసీల మధ్య  పోటీ జరిగిందని తెలుస్తుంది. అయితే నలుగురిలో కాజల్, మానస్‌ను సేవ్ చేసి జేసీ సరయూల్లో ఒకరు ఎలిమినేటి అవ్వనున్నారని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎలిమినేషన్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందట. అదేంటో తెలియాలంటే ఈ వారం వరకు వేచివుండాల్సివుంది.