మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

సెంట్రల్ బ్యాంకులో చోరీ చేసిన భార్యాభర్తలు

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ బ్యాంకులో ఇద్దరు భార్యాభర్తలు చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గచ్చిబౌలిలో సెంట్రల్ బ్యాంకుకు చెందిన ఓ బ్రాంచ్ వుంది. ఇందులో చోరీ చేయడానికి భార్యాభర్తలు వచ్చారు. ముందుకు బ్యాంకులోకి ప్రవేశించేందుకు కొన్ని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించి, స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యపడలేదు. దీంతో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను ఎత్తుకుని వెళ్లారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వ్యవహారంపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చోరీకి పాల్పడిన దంపతుల కోసం గాలిస్తున్నారు.