శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 17 అక్టోబరు 2022 (15:40 IST)

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు పోలింగ్.. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ

shasi tharoor
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 40 కేంద్రాల్లో 68 బూత్‌ల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 9800 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చునని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 19వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
 
కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన నాయకుడు శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతోంది. చివరిసారిగా 2000వ సంవత్సరంలో సోనియాగాంధీ, జితేంద్ర ప్రసాద మధ్య ఈ ఎన్నిక జరుగగా, సోనియాగాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ-గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు కానున్నారు. చివరిసారిగా 1998లో సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.