గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (12:25 IST)

భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం.. భార్య ఉరేసుకుని ఆత్మహత్య

woman
అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం నెరపాడనే మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధురవాయల్ కు చెందిన రాజా ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. భార్య కళై సెల్వితో ఇతనికి నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. 
 
ఈ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు వున్నారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం రాజా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూడగా వంట గదిలో కళై సెల్వి ఉరేసుకుని మృతి చెంది కనిపించింది. 
 
మధురవాయల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో రాజా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.