సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

తన ముగ్గురు పిల్లలకే జీవితాన్ని అంకితం చేసిన చలపతిరావు

chalapathi rao
సీనియర్ నటుడు చలపతి రావు తన ముగ్గురు పిల్లలకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన చెన్నైలో ఉన్న సమయంలో చలపతిరావు భార్య ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. అప్పటికే ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వారి కోసం ఆయన ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని అంకితం చేశారు. 
 
కాగా, చలపతిరావు 79 యేళ్ల వయస్సులో గుండెపోటుతో ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. 1996లో 22 యేళ్లకే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన చలపతిరావు.. ఆయన సూపర్ కృష్ణతో చేశారు. కృష్ణ నటించిన "గూఢచారి 116" అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చలపతి రావు దాదాపు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా ఏడు చిత్రాలను నిర్మించారు. తన 55 యేళ్ల సుధీర్ఘ సినీ కెరీర్‌లో ప్రేక్షకులను హాస్య నటుడుగా, విలన్ పాత్రల్లో ఎంతగానో మెప్పించి ఆలరించారు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగివుంది. 
 
కుమారుడు, ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత ఆయన భార్య ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. ఆయన చెన్నైలో ఉన్న సమయంలో ఈ విషాదం జరిగింది. తెల్లవారుజామున మంచినీల్లు పట్టేందుకు వెళ్లినపుడు ఆమె చీరకు నిప్పు అంటుకుంది. ఆమె అరుపులు విన్న చలపతిరావు మంటలార్పారు. తీవ్ంగా గాయపడిన భార్యను ఆస్పత్రిలో చేర్చగా, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదశ్వాస విడిచారు. అప్పటి నుంచి చలపతిరావు వివాహం చేసుకోకుండా తన పిల్లల బాగోగులను చూసుకుంటా కాలం వెళ్లదీశారు. 

టాలీవుడ్‌లో మరో గొప్ప నటుడు కన్నుమూత 
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన జరిగింది. కేవలం రెండు రోజుల్లో మరో కీలక నటుడు మృతి చెందారు. ఆయన పేరు చలపతి రావు. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన నటనకు కూడా దూరంగా ఉన్నారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. దాదాపు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. 
 
కృష్ణా జిల్లా బల్లిపర్రు అనే గ్రామంలో గత 1944లో జన్మించిన చలపతిరావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతివార్తతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ షాక్‌కు గురైంది. 
 
గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా పూర్తికాకముందే ఆయన చనిపోయారు. చలపతి రావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.