శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (18:19 IST)

క్రిస్మస్ శుభాకాంక్షలతో.. కానుకలు పంపుతున్న పవన్ దంపతులు

Pawan Kalyan
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రతి సంవత్సరం వేసవిలో, తన తోటలోని మామిడి పండ్లను ప్యాక్ చేసి, టాలీవుడ్ ప్రముఖులు హీరో నితిన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు పంపటం అలవాటు. ప్రస్తుతం పవన్ ప్రస్తుతం డిసెంబర్ నెలలో కొందరికి క్రిస్మస్ శుభాకాంక్షలను కూడా పంపుతున్నారని తెలిసింది. క్రిస్మస్‌ను పురస్కరించుకుని తన సన్నిహితులకు బహుమతులు పంపడం ప్రారంభించారు పవన్. 
 
తాజాగా పవన్ తన వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్‌కి క్రిస్మస్ కానుక పంపి ఆశ్చర్యపరిచారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నెనా వేణు శ్రీరామ్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలతో కానుకలు కూడా పంపారు. 
 
పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలకు థ్యాంక్స్ చెప్తూ వేణు సతీమణి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస్టు చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే మరికొందరికి కూడా అన్నా-పవన్ కళ్యాణ్  సంతకంతో కూడిన తమ శుభాకాంక్షల సందేశాన్ని సన్నిహితులకు పంపడంలో బిజీగా వున్నారు.
 
కాగా, రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంకు చెందిన 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు.