బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (13:38 IST)

రామ్ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తీసుకోని సింగర్ సునీత..?

Sunitha
మ్యాంగ్ మీడియా అధినేత రామ్ టాలెంటెడ్ మనిషి. ఈయన సింగర్ సునీతను వివాహం చేసుకున్నారు. మొత్తంగా ఈయన ఆస్తి సుమారుగా 700 కోట్ల రూపాయల పైనే వుంటుందని తెలుస్తోంది. అయితే తన భార్య సునీత పేరుపై ఒక్క రూపాయి కూడా రాయలేదట రామ్. 
 
అందుకే కారణం సునీతేనని వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు కోసమే రామ్‌ని పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటున్నారని.. అందుకే ఆమె రామ్ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. 
 
రామ్ ఆస్తులు వద్దని.. ఆయన మాత్రం చాలునని సునీత చెప్పి పెళ్లి చేసుకుందట. రామ్ కోట్లకు ఆస్తి వున్నా కూడా సునీతకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. రామ్‌ని అర్థం చేసుకున్న సునీతలాంటి భార్య ఉండటం నిజంగా రామ్ అదృష్టం అని వాళ్ల ఫ్యాన్స్ అంటున్నారు.