1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (10:18 IST)

బాక్సింగ్‌ ప్రాక్టీస్‌లో సమంత ప్రభు

Samantha Prabhu Boxing Practice
Samantha Prabhu Boxing Practice
నటి సమంత ప్రభు ఇటీవలే విజయ్‌దేవరకొండ సినిమా ఖుషి సినిమాలో షెడ్యూల్లో పాల్గొనాల్సి వుంది. కానీ ఆమె అటెంట్‌ కాలేదు. త్వరలో కోలుకొని యాక్షన్‌ మూడ్‌లోకి రావాలని ఇటీవలే విజయ్‌ దేరకొండ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇప్పటికే మాయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత అందుకు తగినవిధంగా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుంది. వాలెంటైన్‌ డే సందర్భంగా తాను ఫిట్‌గానే వున్నానంటూ పోస్ట్‌పెట్టి అభిమానులకు తెలియజేసింది. 
 
బాక్సింగ్‌ ట్రైనీతో వున్న పిక్‌ను పోస్ట్‌ చేసింది. ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం ఫిబ్రవరిలో విడుదల కావాల్సివున్నా కొన్ని కారణాలవల్ల ఏప్రిల్‌ 14న వాయిదా పడిరది. అయితే సమంత అంతకుముందే కమిట్‌ అయిన సిటాడెల్‌ అనే వెబ్‌సిరీస్‌ చేయాల్సివుందట. మరి ఇది పూర్తి చేశాక ఖుషి సినిమా చేస్తుందేమోనని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ఖుషి సినిమాలో చిన్న పార్ట్‌ ముగించుకుని ఇంటిదగ్గరో వున్నారు. అతను కూడా కొత్త సినిమా కథలు వింటున్నాడు. అందులో భాగంగానే దర్శకుడు పరశురామ్‌ ఇటీవలే నిర్మాత దిల్‌రాజుతో కలిసి సినిమాను కమింట్‌ చేయించారు.