ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:50 IST)

ఖుషిగా విదేశాలకు వెళ్ళిన విజయ్‌దేవరకొండ?

vijay-rashmika
vijay-rashmika
విజయ్‌దేవరకొండ తాజా సినిమా ఖుషి. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఖుషి కోసం సిద్ధం అవుతున్నామని దర్శకుడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. తాజా సమాచారం ప్రకారం విజయ్‌ దేవరకొండ దుబాయ్‌ వెళ్ళినట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో వెళ్ళినట్లు సమాచారం. వీరితోపాటు రష్మిక మందన్న కూడా ఏదో పనిమీద వెళ్ళినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకే వీరిద్దరూ స్పెండ్‌ చేసిన ఫొటోలు బయటకు వచ్చాయి.
 
తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా మనాలీ మీకోసం బస సిద్ధం చేశారు. అందరూ సిద్ధం కండి. మంచి వాతావరణం అంటూ మనాలికి సంబంధించిన రిసార్ట్స్‌ పొటోలను పోస్ట్‌ చేశాడు. ఇది వ్యాపార ప్రకటనో తన కుటుంబమంతా ఇక్కడకు వస్తున్నారనేది తెలియకుండా తెలియజేశాడు. అయితే షడెన్‌గా విదేశాలకు షూటింగ్‌ నిమిత్తం వెళ్ళినట్లు తెలిసింది. కాగా, విజయ్‌ దేవరకొండతో తన స్నేహాన్ని కానీ ప్రేమను కానీ బహిరంగంగా రష్మిక వ్యక్తం చేయలేదు. గీతగోవిందం నుంచి డియర్‌ కామ్రేడ్‌ వరకు వీరి మధ్య స్నేహం మరింత బలమైందనే టాక్‌ వుంది. త్వరలో వీరి గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.