గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (11:32 IST)

ఖుషి నుంచి లేటెస్ట్ అప్డేట్.. సమంత తల్లిగా టబు?

Tabu
టాలీవుడ్ క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. కానీ సమంత కాస్త షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వైరల్ అవుతోంది. 
 
తాజాగా ఖుషి మూవీలో ఒకప్పటి అందాల తార టబు కూడా నటిస్తున్నారట. ఇందులో టబు సమంత తల్లి పాత్రలో కనిపిస్తోందని తెలుస్తోంది. ఎంతో మోడ్రన్‌గా ఉండే ఈ రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ కోసం ఆమె త్వరలోనే సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నారని కూడా తెలుస్తోంది. గతంలో టబు 'అల.. వైకుంఠపురములో' మూవీలో అల్లు అర్జున్ తల్లిగా నటించిన విషయం తెలిసిందే.