మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (10:13 IST)

నువ్వొక యోధురాలివి.. నిన్ను ఏదీ ఓడించలేదు.. సమంతకు రాహుల్ సందేశం

samanta
హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు ఆమె పోరాటం చేస్తున్నారు. అలాంటి సమంతకు అనేక మంది ధైర్య వచనాలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకు ధైర్యం చెబుతూ ఓ క్రిస్మస్ సందేశాన్ని పంపించారు. "నువ్వొక యోధురాలివి.. నిన్ను ఏదీ ఓడించలేదన్నారు. ఇలాంటివి నిన్నుఇంకా బలపడేలా చేస్తాయని, ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి" అని రాసుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం "నీ దారి చీకటిలో ఉండొచ్చు కానీ, త్వరలోనే అది ప్రకాశిస్తుంది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం "నీ శరీరంలో కదలికలు కష్టంగా ఉండొచ్చు.. కానీ, త్వరలోనే అన్నీ బాగుంటాయని, నువ్వు ఉక్కు మహిళవని, విజయం నీ జన్మహక్కు" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. 
 
రాహుల్ రవీంద్రన్ నుంచి వచ్చిన సందేశాన్ని అందుకున్న తర్వాత సమంత రిప్లై ఇచ్చారు. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితమని, పోరాడుతూనే ఉంటే గతంలో కంటే బలంగా తయారవుతారని రాసుకొచ్చింది.