అవన్నీ తప్పుడు వార్తలే.. విశ్రాంతి తీసుకుంటున్నా.. సమంత
తాను బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హీరోయిన్ సమంత తరపు వర్గాలు స్పష్టం చేశారు. అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనీ డిజార్డర్‌తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి ఆమె వైదొలగుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సమంత ప్రతినిధి స్పష్టత నిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.
"సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఖుషి చిత్రంలో పాల్గొంటారు. అది పూర్తయిన వెంటనే ఇప్పటికే ఆమె సమ్మతించిన బాలీవుడ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. జనవరి నుంచి సమంత ఒక హిందీ చిత్రం షూటింగులో పాల్గొనాల్సివుంది. అయితే, ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదు. బహుశా ఆ సినిమా షూటింగులో మరో ఆర్నెల్ల ఆలమస్యమయ్యే అవకాశం ఉంది" అని వివరణ ఇచ్చారు.