శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (15:22 IST)

ట్విట్టర్‌లోకి అడుగుపెట్టనున్న కంగనా రనౌత్

kangana
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో వుంటున్న కంగనా రనౌత్, ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడంతో, తిరిగి ట్విట్టర్‌లోకి రానున్నట్లు తెలిపింది. మరోవైపు ట్విట్టర్‌లో నిలిచిపోయిన ఖాతాలు అన్నింటినీ పునరుద్ధరించేందుకు మస్క్ సుముఖంగా ఉన్నారు. 
 
గతంలో వివాదాస్పద పోస్ట్‌లతో ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో కంగనా ఖాతా నిలిచిపోయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితమైంది. అంతేగాకుండా ఇన్‌స్టాపై కంగనా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.