శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (12:39 IST)

హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తే అంతే సంగతులు..

Kalpika
Kalpika
యశోద సినిమాలో కల్పిక గణేశ్ చేసిన పాత్ర మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ల పక్కన వుండే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలా వుండాలో చెప్పింది. ఇంతవరకూ ఒక 30 సినిమాలు చేశానని వెల్లడించింది. వాటిలో 15 మాత్రమే రిలీజ్ అయ్యాయని వెల్లడించింది. 
 
కొన్ని సినిమాలు చేసిన తర్వాత తనను పక్కనబెట్టేశారని తెలిపింది. హీరోయిన్స్‌ కంటే బాగా కనిపిస్తున్నానని తనను పక్కన బెట్టారని వెల్లడించింది. తాను చంద్రశేఖర్ యేలేటి గారి స్కూల్ నుంచి వచ్చానని... కానీ అలాంటి వాతావరణం బయట ఎక్కడా కనిపించలేదని పేర్కొంది.
 
అంతేగాకుండా 'నీకు కాస్త యాటిట్యూడ్ ఎక్కువ' అనేవారని కల్పన చెప్పుకొచ్చింది. మంచి పాత్ర కోసం వేచి చూడటమే తాను తక్కువ సినిమాలు చేసేందుకు కారణమని చెప్పుకొచ్చింది.