బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (14:31 IST)

సమంత నీ స్మైల్‌ కోసం ఎదురుచూస్తున్నా: విజయ్‌ దేవరకొండ

Samantha, Vijay Deverakonda
Samantha, Vijay Deverakonda
నటి సమంత అనారోగ్యంతో వున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కోలుకుంటుంది. శాకుంతలం అనే సినిమా చేసింది. అది త్వరలో విడుదల కాబోతుంది. తాజాగా ఆమె విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేయబోతోంది. అప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ కూడా బయటకు విడుదల చేశారు. ఆ తర్వాత సమంత అనారోగ్య కారణంగా పలు సాంకేతిక కారణాలవల్ల షూటింగ్‌ వాయిదా పడింది. లేటెస్ట్‌గా ఈరోజే ఖుషి షూట్‌ ప్రారంభమయిందని విజయ్‌దేవరకొండ ట్వీట్‌ చేశారు.
 
vijay-samantha post
vijay-samantha post
ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ, మేమంతా మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం. నీ నవ్వుతో ఖుషి చేయడానికి త్వరగా రావాలని అన్నాడు. ఇందుకు ప్రతిగా సమంత, అతి త్వరలో నేను రాబోతున్నాను. పున:ప్రారంభంగా షూట్‌లో జాయిన్‌ అవుతాను. ఈరోజు రాలేనందుకు విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు, తన ఫ్యాన్స్‌కూ క్షమాపణలు చెప్పింది. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.