గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (16:17 IST)

కీర్తిసురేష్‌ పెళ్లి అబద్ధమన్న ఆమె తల్లి

menaka-keerthy
menaka-keerthy
తన కుమార్తె కీర్తిసురేష్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె తల్లి మేనక ఖండించింది. సోషల్‌ మీడియాలో కీర్తి సురేష్‌తో వున్న ఫొటో పెట్టి ఇటువంటివార్తలు ఎందుకు రాస్తారో అర్థంకావడంలేదంటూ ఏదైనా వుంటే తామే అందరికీ చెబుతామని తెలియజేసింది. ఇప్పటికే కీర్తి తన పదమూడేళ్ళ స్నేహితుడిని వివాహం చేసుకోనుందని వార్తలు వచ్చాయి. మరోవైపు తమిళ స్టార్‌ విజయ్‌ను కూడా చేసుకోబోతుందంటూ కోలీవుడ్‌ మీడియా కోడై కూసింది. 
 
అందుకే మేనక మాట్లాడుతూ, నా కూతురు పెళ్లి వార్తలు అవాస్తం. ఆమె ఇప్పుడు తన కెరీర్‌ను మాత్రమే ప్రేమిస్తుంది. ఏదైనా వుంటే అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ నాని నటించిన ‘దసరా’ సినిమాలో నటించింది. ఆ తర్వాత రివాల్వర్‌ రీటాలో నటిస్తుంది.