సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (12:51 IST)

చిన్ననాటి స్నేహితుడితో కీర్తి సురేష్ ప్రేమ.. సహజీవనం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ తో కీర్తి సురేష్ ప్రేమలో వున్నట్లు గతంలో జోరుగా ప్రచారం సాగింది. దాన్ని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. 
 
తాజాగా కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడైన ఓ వ్యాపారవేత్తతో సహజీవనంలో వుందని.. నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ స్నేహితుడికి కేరళలో వ్యాపారాలు వున్నట్లు తెలుస్తోంది. 
 
కీర్తి సురేష్‌ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా రాబోతోన్న దసరా సినిమాతో మెస్మరైజ్ చేయనుంది. ఈ చిత్రం పూర్తిగా నేచురల్‌ లుక్‌లోనే కీర్తి సురేష్‌ కనిపించబోతోంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిచారు.