ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (20:30 IST)

ప్లస్ -1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

కేరళలోని తిరువనంతపురంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్లస్-1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని పెరుమదురైకి చెందిన మహ్మద్ జాసిర్ (26).. కొల్లంకు చెందిన ఓ ప్లస్ 1 విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.
 
ఇద్దరూ తరచూ ఫోటోలు షేర్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు. కొద్ది రోజుల క్రితం ఆ విద్యార్థినిని స్వయంగా కలిసి మాట్లాడారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకున్నారు. ఆపై విద్యార్థిని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని తెలిసింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన జజీర్, అతని ముగ్గురు స్నేహితులు నౌబాల్, నియాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.