గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (14:33 IST)

నెల్లూరు జిల్లా ముగ్గురు బాలికల అదృశ్యం

woman
నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలికల అదృశ్యం సంచలనం సృష్టించింది. నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి అంకిత, మల్లిక జ్యోతి, నాగమణి అనే ముగ్గురు బాలికలు కనిపించటం లేదని పాఠశాల సిబ్భంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 
 
అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లో ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన విద్యార్థినులు రాపూరు,  కలువాయి, పొదలకూరుకు చెందిన వారని పాఠశాల సిబ్బంది చెప్పారు. గతంలోనూ ఈ పాఠశాల నుంచి విద్యార్థులు కనిపించకుండా పోవడం ఇది తొలిసారి కాదని వారు పోలీసులు చెప్తున్నారు.