బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (10:16 IST)

నేటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు టూర్

chandrababu
టీడీపీ అధినేత, మాజ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. సాయంత్రం 4 నుంచి 5.15 గంటల వరకు కందుకురూ రోడ్‍‌లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. బుధవారం కందుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. 
 
అలాగే, గురు, శుక్రవారాల్లో కావలి, కోవూరు నియోజకవర్గాలో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్  వివరాలను టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరే చంద్రబాబుకు మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ బైక్ ర్యాలీని నిర్వహిస్తారు.
 
సాయంత్రం 4 గంటల నుంచి 5.15 గంటల వరకు వెంకటనారాయణ నగర్, అంబేద్కర్ విగ్రహం, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ నిర్వహించి రాత్రికి కందుకూరులోనే బస చేస్తారు.