సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (08:26 IST)

నేడు తెలంగాణాలో టీడీపీ శంఖారావం.. హాజరుకానున్న చంద్రబాబు

chandrababu
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. శంఖారావం పేరిట నిర్వహించే ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరం నుంచి భారీ వాహనశ్రేణిలో వెళతారు. ఈ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ మైదానంలో నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.
 
నిజానికి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనపడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు, ఆ తర్వాత మరికొందరు తెరాస పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇపుడు టీడీపీలో చెప్పుకోదగిన సీనియర్ నేతలులేరు. ఉన్నవారంతా చోటామోటా నేతలే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు దృష్టిసారించారు. 
 
ఇందులోభాగంగా, బుధవారం ఖమ్మంలో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సభ కోసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.