ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (16:16 IST)

మద్యంమత్తులో ఇంటి యజమానిని హత్యచేసిన వ్యక్తి

crime scene
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో మద్యంమత్తులో ఇంటి యజమానిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ దారుణం పట్టణంలోని చాకలి వీధిలో జరిగింది. మద్యం మత్తులో ఇంటి యజమాని ఓబులేసును ఓ వ్యక్తి హత్య చేశాడు.

రాజశేఖర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా నోటికి కొచ్చినట్టు  మాట్లాడుతుండటంతో.. ఇంటి యజమాని ఎందుకు ఇలా అరుస్తున్నావని మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓబులేసు.. ఇంటి యజమానితో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ఆయన్ను హత్యచేశాడు.
 
ఐదు నెలల క్రితం రాజశేఖర్ ఇంటిలో అద్దెకు దిగిన ఓబులేసు... ఆయన వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మద్యానికి బానిసైన రాజశేఖర్ ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి అరిచేవాడు.

ఇదే విషయంపై ఇంటి యజమాని నిలదీయడంతో దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఓబులేసు కోసం గాలిస్తున్నారు.