1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

బాలికకు బలవంతంగా తాళికట్టిన కీచక టీచర్... మూడేళ్లుగా అత్యాచారం.. ఎక్కడ?

ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన కీచక ఉపాధ్యాయుడు ఒకడు తన వద్ద చదువుకునేందుకు వచ్చిన విద్యార్థినిని మూడేళ్లుగా లైంగికదాడి పాల్పడుతున్నాడు. పైగా, బలవంతంగా పెళ్లి చేసుకుని, ఓ గదిలో నిర్బంధించడమే కాకుండా బాధితురాలి తల్లిదండ్రుల నుంచి రూ.2 లక్షల నగదు కూడా తీసుకున్నాడు. ఈ కీచక వేధింపులు భరించలేని ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
ఈపూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన బత్తుల రవి కుమార్ వద్ద చదువుకుంటుంది. ఈ క్రమంలో ఓ రోజున ఆ బాలికను ఇంటికి పిలిచి శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను వివస్త్రను చేసి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని పదేపదే బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. 
 
ఈ క్రమంలో గత యేడాది సెప్టెంబరు నెలలో బాధితురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో బాలిక మెడలో బలవంతగా తాళికట్టాడు. అదే యేడాది నవంబరు 22వ తేదీన ఆ బాలికను పిడుగురాళ్ళకు తీసుకెళ్ళి తన వదిన ఇంట్లో నిర్బంధించాడు. అప్పటి నుంచి ప్రతి రోజూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో పలు న్యూడ్ వీడియోలు కూడా తీశాడు. వాటిని చూపి బెదిరిస్తూ విడతలవారీగా రూ.2 లక్షల మేరకు వసూలు చేశాడు. అయితే, కీచకుడి వేధింపులు నానాటికీ ఎక్కువైపోతుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో తక్షణ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్పీ విజయభాస్కర్ ఈపూరు ఎస్ఐను ఆదేశించారు.