కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు
కేరళ రాష్ట్రంలో మరో ఫుడ్‌పాయిజనింగ్ కేసు వెలుగు చూసింది. పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వడ్డించిన ఆహారాన్ని ఆరగించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన కూడా పతినంతిట్ట జిల్లాలోనే జరిగింది. జిల్లాలోనే కొడుమోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీన జరిగింది.
ఆహారం ఆరగించిన విద్యార్థుల్లో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఏడెనిమిది మంది అస్వస్థతకు లోనైనట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, ఇటీవల కాసరగోడ్ జిల్లా పెరంబాలకు చెంది అంజు శ్రీపార్వతి అనే యువతి స్థానిక హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని ఆరగించింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు మరికొందరు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు.