1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:47 IST)

ఎముక పుష్టి కోసం ఇవి తినాల్సిందే

ఎముకలను బలోపేతం చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఎముకలు పుష్టిగా వుంటేనే మనిషి శరీరం సహకరిస్తుంది. లేదంటే కాస్త దూరం నడవాలన్నా, పని చేయాలన్నా ఇబ్బందిపడతారు. ఏ ఆహారం ఎముకలను బలోపేతం చేస్తాయో తెలుసుకుందాము.

 
వాల్ నట్స్- ఇందులో క్యాల్షియం ఉంటుంది. పాలతో కలిపి తింటే మేలు జరుగుతుంది.

 
సాల్మన్ చేపలు- వీటిని తినడం వల్ల కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి.

 
గుడ్లు- కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాల నిల్వ ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటూ వుండాలి.

 
బచ్చలికూర- బచ్చలికూరలో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ కె కూడా ఉంటుంది.

 
ఎర్ర ముల్లంగి- ఎర్ర ముల్లంగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఉంటాయి.

 
పనీర్-  పనీర్‌లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.

 
అరటిపండు- అరటిపండులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.

 
పాలు- పాలలో కాల్షియం అత్యధికంగా ఉంటుందని చెబుతారు.

 
సోయాబీన్- సోయాబీన్‌లో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది.

 
బ్రోకలీ- పాలు, సోయాబీన్స్ తర్వాత అత్యధిక కాల్షియం కంటెంట్ కలిగిన కూరగాయ ఇది.

 
గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.