శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (10:20 IST)

ఎర్నాకుళం మహాదేవ ఆలయంలో నటి అమలాపాల్‍కు చేదు అనుభవం

amalapaul
సినీ నటి అమలాపాల్‌కు ఆమె సొంత రాష్ట్రం కేరళలో చేదు అనుభవం ఎదురైంది. ఈ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ప్రసిద్ధ తిరువైరానికుళం మహాదేవ ఆలయం ఉండగా, ఆలయ దర్శనం కోసం వెళ్లిన అమలాపాల్‌కు చుక్కెదురైంది. ఇక్కడ కేవలం హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అన్యమతస్తులకు ప్రవేశం లేదు. ఈ కారణంగా అమలాపాల్‌కు ఆలయ అధికారులు అనుమతి నిరాకరించారు. దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లకుండా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్‌‌లో నమోదు చేశారు. 
 
"నేను అమ్మావారిని చూడలేక పోయినా ఆత్మను అనుభవించాను. 2023వ సంత్సరంలో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ విషయం నన్ను నిరాశపరిచింది. నేను దేవత దగ్గరికి వెళ్లలేక పోయాను. కానీ దూరం నుంచి ఆత్మను ప్రార్థించాను. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుదని ఆశిస్తున్నాను. సమయం వస్తుంది. మనంమందరం మతం ప్రాతిపదనకాకుండా అందరినీ సమానంగా చూస్తారు" అని అమలాపాల్ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తిరువైరానికుళం మహదేవ ఆలయ ట్రస్టు నిర్వాహకులు ఉలికిపాటుకు గురయ్యారు.