ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేపాల్‌లో విమాన ప్రమాదం.. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన వీడియో..

nepal plane
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 67 మంది చనిపోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్ అయింది. అయితే, ఈ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పొఖారా విమానాశ్రయానికి సమీపంలో ల్యాండింగ్‌కు మరికొన్ని క్షణాలు ముందు నియంత్రణ కోల్పోయిన ఈ విమానం కుప్పకూలిపోయింది. అయితే, తాజాగా ఇదే విమానానికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగే కొన్ని క్షణాలు ముందు ఈ విమానం గాల్లో నియంత్రణ కోల్పోయి వేగంగా కిందపడిపోతున్నట్టు అందులో కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద శబ్దం వినిపించింది. అయితే, ఈ వీడియో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఓ భవనంపై నుంచి తీసినట్టుగా ఉంది.
 
ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. విమానంలో సిబ్బందితో కలుపుకుని మొత్తం 72 మంది ఉండగా, అందులో 67 మంది చనిపోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ విషాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం జాతీయ సంతాప దిన ప్రకటించింది. విమానంలో ఐదుగురు భారతీయులతో పాటు మొత్తం 15 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.