బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తిరుమలలో హల్చల్ చేస్తున్న ఎలుగుబంట్లు..

bear spotted in turumala
తిరుమలలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఇవి రాత్రిపూట అధికంగా సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా, తిరుమలలోని స్థానికులు నివాసం ఉండే ఈస్ట్ బాలాజీ నగరులోని బాలగంగమ్మ ఆలయం వద్ద రెండు ఎలుగుబంట్లు కనిపించాయి. 
 
వీటిని చూసిన స్థానికులు భయంతో ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చిన ఎలుగుబంట్లను అడవిలోకి పంపేందుకు శ్రమించారు. ఈ ఎలుగుబంట్ల సంచారం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది.