ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (10:51 IST)

శ్రీవారి కానుకల రికార్డ్.. ఆయన రికార్డును ఆయనే బ్రేక్ చేశారు..

tirumala
తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీగా కానుకలు వెల్లువెత్తాయి. వైకుంఠ శోభతో తిరుమల కళకళలాడుతున్న తరుణంలో సోమవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ స్థాయిలో భక్తులు వెంకన్న ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారికి కానుకలు వెల్లువెత్తాయి. వైకుంఠ ద్వారాలు తెరిచే కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది ప్రముఖులు, సామాన్య ప్రజలు తిరుపతికి తరలివచ్చారు. 
 
హుండీ ఆదాయంలో శ్రీవారి రికార్డును ఆయనే తిప్పి రాశారు. ఒక్కరోజే తిరుపతి కానుకల వసూళ్లు రూ.7.68 కోట్లు చేరినట్లు తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 23న తిరుపతి దేవస్థానం ఒక్కరోజులో రూ.6.31 కోట్లు వసూలు చేసి ఒక్క రోజులోనే అంత వసూళ్ల సాధించి రికార్డు సృష్టించింది.