గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (09:36 IST)

తిరుమల శ్రీవారి భక్తులకు పెద్ద షాక్... గదుల అద్దె ధరలు పెంపు

Devotees-Tirumala
తిరుమల శ్రీవారి భక్తులకు పెద్ద షాక్. తిరుమలలో గదుల అద్దెల ధరలు పెంచి సామాన్యులకు షాకిచ్చింది టీటీడీ. నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత ధరలను రూ.500, రూ.600 నుంచి రూ.1000కు పెంచినట్లు సమాచారం. 
 
నారాయణగిరి రెస్ట్‌హౌస్‌లోని 1,2,3 గదుల ధరలను కూడా అధికారులు రూ.150 నుంచి రూ.1700కు పెంచారు. 
 
రెస్ట్ హౌస్ అద్దె ధరలు రూ.750 నుంచి రూ.1700కి పెరిగాయి. జీఎస్టీతో కలిపి కార్నర్ సూట్ ధర రూ.2200కి పెరిగింది. ప్రత్యేక కాటేజీల గది అద్దెలు రూ.750 నుంచి రూ.2800కి పెరిగాయి.  
 
అంతేగాకుండా గది అద్దెతో పాటు నగదు కూడా డిపాజిట్ చెల్లించాల్సి వుంటుందని టీటీడీ ప్రతిపాదించింది. ఉదాహరణకు రూ. 1700ల గది అద్దెకు కావాలనుకున్నప్పుడు కలిపి రూ.3400చెల్లించాల్సి ఉంటుంది. గదుల అద్దెలు పెంచడంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 
 
స్వామి భక్తులను నిలువు దోపిడీ చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని అంటున్నారు. జనవరి 1వ తేది నుంచి పెంచిన ధరలు వసూలు చేస్తోంది టీటీడీ.