సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (10:53 IST)

వైకుంఠ ఏకాదశి.. ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు

tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రత్యేక ప్రవేశం, వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందవచ్చునని టీటీడీ ప్రకటించింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు రెండు లక్షల 20వేల టిక్కెట్లను అందుబాటులో వుంచారు. 
 
జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశిని పురస్కరించుకుని పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. రోజుకు 2000 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుండగా భక్తులు రూ.10,000 శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా అందించి రూ.300/- దర్శనం టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.