మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (09:56 IST)

తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడి గుండెపోటు

Dharmareddy
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు కార్యనిర్వాహక అధికారి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 28 యేళ్ల చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామికవేత్త, తితిదే చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి ఏకైక కుమార్తెతో వివాహం నిశ్చియమైంది. కొన్ని రోజుల క్రితమే ఈ వివాహం జరిగింది. వీరి వివాహం జనవరిలో తిరుమలలో అంగరంగం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులోభాగంగా, ఇరు కుటుంబాల సభ్యులు శుభలేఖలు పంచుతున్నారు.
 
ఈ నేపథ్యంలోని చెన్నైలోని తమ బంధువులకు శుభలేఖలు ఇచ్చేందుకు చంద్రమౌళి తన స్నేహితులతో కలిసి చెన్నైకు వచ్చారు. ఆయనకు ఆదివారం కారులో వెళుతుండగా గుండెనొప్పిగా ఉన్నట్టు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ వెంటనే చెన్నైలో ఉండే శేఖర్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. ధర్మారెడ్డి దంపతులు సాయంత్రానికి ఆస్ప్తరికి చేరుకున్నారు.