గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హుజూర్‌నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయింజన్ అయింది. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వీరి పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
శనివారం ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తల్లిదండ్రులు ఖర్జూర పండ్లు స్నాక్స్‌గా ఇచ్చారు. ఆ పండ్లను తన స్నేహితులకు కూడా సదరు విద్యార్థి పంచిపెట్టాడు. ఈ పండ్లను ఆరగించిన పది మంది విద్యార్థులకు కొద్దిసేపటికే ఫుడ్‌‍పాయిజన్ అయింది. 
 
కాలపరిమితి దాటిన పండ్లను ఆరగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడివుంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పెద్దిరెడ్డి పరామర్శించారు.