గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (08:56 IST)

హైదరాబాద్‌లో రేవ్ పార్టీ ఛేదించిన పోలీసులు..

rave party
హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పసుమాముల వద్ద గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీ భాగోతాన్ని పోలీసులు గుర్తించారు. ఇందులో మొత్తం 29 మంది యువకులు, నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, వీరి నుంచి గంజాయి ప్యాకెట్లు, 11 కార్లు, ఒక బైకు, 28 మంది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
అరెస్టు చేసినవారంతా సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలకు చెందిన విద్యార్థులు కావడం గమనార్హం. సుభాష్ అనే వ్యక్తి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనిపై పక్కా సమచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు గంజాయి సేవించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.