మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (13:25 IST)

నగల దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు

హైదరాబాద్‌లోని నాగోల్‌లోని స్నేహపురి కాలనీలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు నగల దుకాణంలోకి చొరబడి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 
 
ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి బంగారాన్ని తమకు ఇవ్వాలని కార్మికులను బెదిరించినట్లు సమాచారం. అయితే కార్మికులు అందుకు నిరాకరించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఆ తర్వాత నిందితులు కార్మికులపై మూడుసార్లు కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలతో దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.