శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (20:40 IST)

ఆండ్రియా సెన్సేషనల్ కామెంట్స్.. 20 ఏళ్లలోనే ప్రేమ.. ఆపై మోసం..

andrea jeremiah
సినీ నటి, గాయని ఆండ్రియా సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాను 20 సంవత్సరాల్లో వున్నప్పుడే ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని వెల్లడించింది. అతనితో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. ఆ వ్యక్తి తనను చాలా దారుణంగా మోసం చేశాడని కూడా తెలియ‌జేసింది. 
 
గ్లామరస్ పాత్రల్లో కనిపించేందుకు ఏమాత్రం సంకోచించనని ఆండ్రియా తెలిపింది. దీంతో నెటిజ‌న్స్ ఆమెని అంత‌గా వాడుకొని వ‌దిలేసిన వ్య‌క్తి ఎవ‌రా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. 
 
ఆండ్రియా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి మిష్కిన్ దర్శకత్వంలో నటించిన పిశాచి 2, రెండో అనల్ మేలే పని తులి. ఈ చిత్రానికి దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన ఈ చిత్రానికి కైసర్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇది శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పిశాచి 2 కూడా త్వరలో తెరపైకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.