శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నగ్నంగా నటించింది కానీ ఆ సీన్లు చిత్రంలో వాడలేదు..

andrea jeremiah
కోలీవుడ్ నటి ఆండ్రియా జెర్మయ్య "పిశాచు-2" చిత్రంలో నగ్నంగా నటించారు. కథ డిమాండ్ మేరకు ఆమె అలా నటించేందుకు సమ్మతించారు. తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ నెల 31వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో సూపర్ హిట్ అయిన "పిశాచి" చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తుంది. మిష్కిన్ దర్శకత్వం వహించారు. రాక్ ఫోర్ట్ బ్యానరులో నిర్మితమైన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రను పోషించారు. 
 
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు, టీజర్లు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో ప్రధాన పాత్రను పోషించిన నటి ఆండ్రియా జెర్మయ్య న్యూడ్‌గా నటించారు. దీనిపై డైరెక్టర్ మిష్కిన్ స్పందిస్తూ, కథ డిమాండ్ మేరకు అలా నటించారని, ఇందుకోసం ఆమె అధిక రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశారని, ఇందులో ఎలాంటి తప్పు లేదన్నారు. 
 
అయితే, ఆండియాను నగ్నంగా వీడియోలు తీయలేదన్నారు. ఆమె వ్యక్తిగత స్టిల్ ఫోటోగ్రాఫరుతోనే స్టిల్ ఫోటోలు తీశామని చెప్పారు. పైగా, ఈ ఫోటోలను సినిమాలో వినియోగించలేదన్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని పిల్లలు కూడా చాడాలని భావించామని, పైగా సెన్సార్ సభ్యులు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తారోనన్న భయం ఏర్పడిందని అందుకే ఆ న్యూడ్ ఫోటోలను సినిమాలో వినియోగించలేదని చెప్పారు.