శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (19:46 IST)

జిమ్‌లో వర్కౌట్లు... జీరో సైజులో నిహారిక

Niharika
Niharika
చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె పలు వెబ్ సిరీస్‌లతో బిజీ కానుంది. పెళ్లి తర్వాత కొంచెం బొద్దుగా మారిన నిహారిక.. ఇప్పుడు తన ఫిట్‌నెస్‌పై ఫుల్‌గా దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతుంది. 
 
కొన్నాళ్ళు ఇన్‌స్టాకు దూరమైన నిహారిక.. ఇప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది.
 
తాజాగా తన భర్త చైతన్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేసిన ఫోటోలను షేర్ చేసింది నిహారిక. ఇందులో ఆమె జీరో సైజ్‌తో కనిపిస్తుండటం విశేషం.