గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (16:03 IST)

శృంగారానికి నిరాకరించిన 38 యేళ్ళ భార్య - చంపేసిన 28 యేళ్ళ భర్త

murder
తనతో శృంగారానికి నిరాకరించిన భార్యను ఎవరికీ అనుమానం రాకుండా కడతేర్చాడో కసాయి భర్త. పైగా, తన భార్య కనిపించడం లేదంటూ కట్టుకథ అల్లాడు. చివరకు అతను చేసిన కసాయి పని బయటపడటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రానికి చెందిన 28 యేళ్ళ పృథ్వీరాజ్ సింగ్ అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ బెంగుళూరులో ఉంటున్నాడు. ఈయనకు 9 నెలల క్రితం జ్యోతి కుమారితో వివాహమైంది. భార్య వివాహ సమయంలో వయసు దాచిపెట్టారు. వివాహం తర్వాత భార్య వయస్సును కనిపెట్టాడు. తనకంటే పదేళ్లు పెద్దదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. పైగా, తనతో శారీరకంగా కలవకుండా తనను, తన కుటుంబ సభ్యులను అనాగరికులనే ముద్ర వేసింది. దీంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, ఈ నెల 3వ తేదీన ఉడుపికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడు సమీర్ కుమార్‌తో కలిసి ఊపిరాడనీయకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ కట్టుకథ అల్లాడు. బెంగ‌ళూర్‌కు తిరిగివ‌చ్చిన సింగ్ త‌నపై అనుమానం రాకుండా ఉండేందుకు భార్య అదృశ్య‌మైంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
 
ద‌ర్యాప్తులో సింగ్‌పై అనుమానం వ‌చ్చిన పోలీసులు త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌గా నేరాన్ని అంగీక‌రించాడు. మృత‌దేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.