గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (14:55 IST)

డొమినోస్ క్వాలిటీ పుడ్‌.. పిజ్జా పిండిపై టాయిలెట్‌ బ్రష్‌లు, ఫ్లోర్‌ క్లీనర్స్

pizza
pizza
పిజ్జా అంటే గుర్తుకు వచ్చేది డొమినోస్. టేస్ట్‌తో పాటు క్వాలిటీ కూడా మెండుగా ఉంటుందని అందరూ నమ్ముతారు. కానీ బెంగళూరులోని డొమినోస్‌ ఫ్రాంచైసీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థ పేరును మసక బారేలా చేస్తోంది. హోసా రోడ్‌లో ఉన్న డొమినోస్‌ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిబ్బంది పిండి తయారు చేశారు. 
 
కాకపోతే ఆ పిండిపై నిర్లక్ష్యంగా టాయిలెట్‌ బ్రష్‌లు, ఫ్లోర్‌ క్లీనింగ్‌ వస్తువులను ఉంచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ఇదేనా డొమినోస్ క్వాలిటీ పుడ్‌ అని మండిపడుతున్నారు.
 
ఈ ఘటనపై స్పందిస్తూ.. డొమినోస్‌ ఎప్పుడూ పుడ్‌ విషయంలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని తెలిపారు.