గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (11:37 IST)

షాలినీ పాండే ఫోటోలు వైరల్

Shalini pandey
Shalini pandey
"అర్జున్ రెడ్డి" చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అలియాస్ షాలినీ పాండే ఆ ఒక్క చిత్రంతోనే బోలెడంత క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఈమెకు ఆ స్థాయి హిట్ సినిమా దక్కలేదు. 
 
‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి చిత్రాల్లో క్రెడిట్ లేని పాత్రలు చేసింది. వాటి వల్ల ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ‘118’ చిత్రం హిట్ అయినా ఈమె పాత్ర నిడివి అందులో తక్కువ.
 
"ఇద్దరి లోకం ఒక్కటే" "నిశ్శబ్దం"చిత్రాలు నిరాశపరచడంతో ఈమెను ఇక్కడ పట్టించుకునేవారే లేరు. దాంతో ఈమె బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు హిందీ సినిమాల్లో నటిస్తుంది. 
 
ఇదిలా ఉండగా.. అక్కడి నేటివిటీకి తగ్గట్టు ఈ అమ్మడు మారిపోయింది. క్లీవేజ్ షోలతో కూడిన ఫోటో షూట్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. తాజాగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.