బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (21:56 IST)

రోడ్డుపై బైకుపై డ్రైవింగ్.. తెల్లచీర మల్లెపువ్వులతో దెయ్యం (video)

ghost
రోడ్డుపై కారు లేదా బైకుపై ప్రయాణం చేస్తుండగా.. తెల్లచీర మల్లెపువ్వులతో ఓ మహిళ రూపం కనిపిస్తే షాకవుతారు కదూ.. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి వేళల్లో తాము ప్రయాణించేటప్పుడు దెయ్యాలను చూసినట్లు కథలు కథలుగా చెప్పుకుంటారు. 
 
కానీ అలాంటి సంఘటనే మనకు ఎదురైతే.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మార్గమధ్యలో తెల్లచీర కట్టుకుని దెయ్యం లాంటి ఆకారం కనిపిస్తుంది. 
 
యువకులు భయాందోళనకు గురై.. బైక్ వేగం పెంచుతారు. అలా స్పీడ్‌గా వెళ్లాక వారికి ఎదురుగా అదే దెయ్యం కనిపిస్తుంది. ఈ ఘటనతో వారు భయంతో వణికిపోతారు. వెనక్కు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ప్రాంక్ వీడియోగా తెలుస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAKHT LOGG