శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. మహామహులు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (14:37 IST)

మయాంక్‌కు మొండి చెయ్యి.. రుతురాజ్ బిహేవియర్ బ్యాడ్

Ruthuraj
Ruthuraj
ఇండియా టెస్టు టీమ్‌లోకి తిరిగి రావాలని ఆశించిన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొండిచేయి చూపించింది. గాయపడ్డ లోకేశ్‌ రాహుల్‌ స్థానంలో మయాంక్‌ను ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో పోటీ పడే టీమ్‌లోకి తీసుకునేందుకు నిరాకరించింది. 
 
ఇప్పటికే జట్టుతో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ రూపంలో ఓపెనర్‌ అందుబాటులో ఉండటంతో మరో ప్లేయర్‌ను చేర్చాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. హెచ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సోమవారం లండన్‌ బయల్దేరుతారు.
 
ఇకపోతే.. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
 
టాస్ సమయానికే పడ్డా.. వరుణుడు పలుమార్లు అడ్డుపడటంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి చిత్తడిగా మారింది. అంపైర్లు గ్రౌండ్ ను పరిశీలించి.. ఆటగాళ్లు గాయపడే ప్రమాదం ఉండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
అయితే వర్షంతో మ్యాచ్ ఆగిపోయిన సమయంలో టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
మ్యాచ్ వర్షంతో ఆగిపోయిన సందర్భంలో భారత్ డగౌట్‌లో రుతురాజ్ గైక్వాడ్ కూర్చోని ఉంటాడు. ఆ సమయంలో గ్రౌండ్స్ మన్ ఒకరు రుతురాజ్ దగ్గర పక్కనే కూర్చొని సెల్ఫీ దిగే ప్రయత్నం చేస్తాడు. రుతురాజ్ ఒక సెల్ఫీ దిగి అతడిని పంపి ఉంటే ఇంత పెద్ధ ఇష్యు అయ్యేది కాదు. 
 
కానీ, పక్కన సెల్ఫీ కోసం కూర్చున్న గ్రౌండ్స్ మన్ పట్ల రుతురాజ్ దురుసుగా ప్రయత్నించాడు. 'ఇక్కడి నుంచి వెళ్లిపో' అంటో కాస్త ఓవర్ చేశాడు. ఇదంతా కూడా కెమెరా కంటికి చిక్కడం.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో రుతురాజ్ పై విమర్శలు ఆరంభం అయ్యాయి.