సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (18:51 IST)

నివృతి ఫోటోలు.. కళ్యాణ్ దేవ్ వున్నాడుగా... శ్రీజతో విడాకులు నిజమా?

Nivruthi
Nivruthi
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్తకు దూరంగా ఉండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇకపోతే శ్రీజ తన భర్తతో విడాకులు తీసుకుందని అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించకుండా తాను మరో పెళ్లికి సిద్ధమైనది అంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.
 
ఈ విధంగా వీరి విడాకుల గురించి శ్రీజ మూడో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు. అలాగే తన భార్య శ్రీజతో కలిసి ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు. ఇక కళ్యాణ్ కనీసం తన పిల్లలతో కూడా ఎక్కడ కనిపించలేదని చెప్పాలి.  
 
తాజాగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నివృతి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను స్కూల్ డేస్ మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. 
 
ఇలా నివృతి షేర్ చేసిన ఫోటోలలో కళ్యాణ్ దేవ్ నవిష్క ఫోటోలు కూడా ఉండడం గమనార్హం. ఒకవేళ శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయి ఉంటే నివృత్తి కళ్యాణ్ ఫోటోని ఎందుకు షేర్ చేస్తుందని మరోసారి నెటిజన్లు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.