శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2022 (21:28 IST)

వరలక్ష్మివ్రతం ఫోటోలను షేర్ చేసిన రంభ

Rambha
కర్టెసి-ట్విట్టర్
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణించిన రంభ ప్రస్తుతం పిల్లాపాపలతో సంతోషంగా కాలం గడుపుతోంది. తాజాగా ఆమె తన ఇంట్లో వరలక్ష్మీవ్రతం పూజ జరుపుకున్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్లో ఆమె షేర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుందని ఆమె తెలియజేసారు.

 
రంభను క్యారెక్టర్ నటి పాత్రల్లో చేయాలంటూ ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. ఐతే ఆమె ఎన్ని అవకాశాలు వస్తున్నా తిరిగి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బహుశా పిల్లల ఆలనాపాలన చూసుకోవాలి కనుక ఆమె నటించేందుకు అంగీకరించడం లేదేమోనని అనుకుంటున్నారు.